Weather Update: వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్ 

Telangana and Andhra Pradesh Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. పగలు ఎండలు మండిపోతున్నాయి.. అంతేకాకుండా.. సాయంత్రం వేళల్లో ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండలు, వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. పగలు ఎండలు మండిపోతున్నాయి.. అంతేకాకుండా.. సాయంత్రం వేళల్లో ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండలు, వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి ద్రోణి/ గాలి అంతరాయం, ఇప్పుడు గంగానది పశ్చిమ బెంగాల్ నుండి, ఒడిశా, దాని పరిసర ప్రాంతాలు, తెలంగాణ, రాయలసీమ – తమిళనాడు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనము మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. దీంతోపాటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనము ఈ రోజు బలహీనపడినది. తక్కువగా గుర్తించబడినది. అంతేకాకుండా.. దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనము ఈ రోజు బలహీనపడినది. తక్కువగా గుర్తించబడినది.

Follow Us More Updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top