రాజ్యసభ వైస్ చైర్మన్లుగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఎంపికయ్యారు.
మొత్తం 8 మంది సభ్యులతో కూడిన వైస్ చైర్మన్ల ప్యానెల్‌ను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ నియమించారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు.