కోదండరాం, అలీఖాన్ లకు చుక్కెదురు

తెలంగాణ  గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన కోదండరాం, అలీఖాన్ లకు చుక్కెదురైంది. వీరిద్దరి పదవీప్రమాణ స్వీకారంపై హైకోర్టు స్టే  ఇచ్చింది. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సుపై  గవర్నర్ తమిళసై  వీరి నియామకాలు జరిపారు.

హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరథే, జస్టిస్ అనిల్ కుమార్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వీరిద్దరి ప్రమాణస్వీకారంపై స్టే విధిస్తూ.. విచారణను ఫిబ్రవరి 8 వ తేదీకి వాయిదా వేసింది. వీరి నియామకాలపై బీఆర్ఎస్ కు చెందిన దాసోజు శ్రవణ్ , కె. సత్యనారాయణ లు హైకోర్టులో పిటీషన్ ఫైల్ చేశారు.

వీరిద్దరినీ అప్పటి బీఆర్ ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రకటించగా గవర్నర్ వారి నియామకాలను ఆమోదించలేదు.

నూతనంగా నామినేట్ అయిన ఇద్దరు ఎమ్మెల్సీల్లో ఒకరు ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్  కోదండరామ్  కాగ, మరొకరు ఉర్థూ జర్నలిస్టు అమీర్ అలీఖాన్. వీరిద్దరూ బుధవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. 

గతేడాది ఆగస్టులోనే ఈ పదవుల కోసం అప్పటి ముఖ్య మంత్రి కేసీఆర్  గవర్నర్ కోటాలో  శ్రవణ్, సత్యనారాయణనలనుఎమ్మెల్సీలుగా ఫైనల్ చేశారు. అయితే నెలతర్వాత సెప్టెంబరులో  రాజకీయ, కార్పొరేట్ రంగాలతో సంబంధంగల  వ్యక్తులుగా వారిని పేర్లను గవర్నర్ తిప్పి పంపారు.