బడ్జెట్ కేటాయింపుల్లో రక్షణ రంగానికి పెద్దపీట

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.47.65 లక్షల కోట్లతో ప్రకటించిన 2024 -25  బడ్జెట్ లో  రక్షణ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.

అలాగే జాతీయ రహదారులు, రైల్వే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, హోం శాఖలకు పెద్ద పీట వేశారు.

రక్షణ రంగానికి  రూ.621000 కోట్లు కేటాయించగా ఆహారానికి రూ. 205250 కోట్లు, హోం శాఖ కు రూ.202868 కోట్లు, పెన్షన్లకు  రూ.239612 కోట్లు, గ్రామీణాభివృద్ధి కి రూ.177000 కోట్లు, ఎరువుల రాయితీకి రూ. రూ.164000 కోట్లు  ఆరోగ్య రంగానికి రూ.90171 కోట్లు, ఆర్థిక శాఖకు రూ.87642 కోట్లు, వ్యవసాయం, అనుబంధరంగాలకు రూ.146819 కోట్లు, 

ఐటీ-టెలికామ్ రంగాలకు రూ.115752 కోట్లు, విద్యకు రూ.24638 కోట్లు, రవాణాకు  రూ.5440039 కోట్లు, జీఎస్టీ పరిహార నిధికి రూ.1,50,000 కోట్లు, వాణిజ్యం, పరిశ్రమలకు రూ.45,958 కోట్లు, ఇంధనానికి రూ.76302 కోట్లు, విదేశీ వ్యవహారాలకు రూ.22154 కోట్లు కేటాయించారు.

ఇదిలా ఉండగా వడ్డీ చెల్లింపులకు  రూ. 1190440 కోట్లు కేటాయించారు.

సామాజిక సంక్షేమానికి రూ.56501 కోట్లు, ట్యాక్స్, అడ్మినిస్ట్రేషన్ కు  రూ.203297 కోట్లు, రాష్ట్రాలకు ఇచ్చే నగదు బదిలీలకు రూ.286787 కోట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.63541 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.77524 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.