ఇంగ్లాండ్ మరియు ఇండియా ల మధ్య ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌

మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా చెలరేగారు. భారీ హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన వీరిద్దరు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు.

వీరు ముగ్గురు కూడా 80+ చొప్పున పరుగులు చేశారు. ధాటిగా ఆడిన యశస్వి జైస్వాల్ 10 ఫోర్లు, 3 సిక్సులతో 74 బంతుల్లో 80 పరుగులు చేశాడు.

123 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 8 ఫోర్లు, 2 సిక్సులతో 86 పరుగులు, 180 బంతులు ఎదుర్కొన్న జడేజా 7 ఫోర్లు, 2 సిక్సులతో 87 పరుగులు చేశాడు.

అయితే వీరు ముగ్గురు 80+ స్కోర్‌లో ఔట్ కావడంతో టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది.

92 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు 80+ పరుగులు చేసి ఔట్ కావడం ఇదే తొలిసారి .