కుమారి  ఆంటీ హోటల్ మళ్లీ స్టార్ట్..

వందల సంఖ్యలో ఎగబడిన జనం కుమారి  హోటల్ మళ్లీ స్టార్ట్ అయ్యింది. మామూలుకంటే మరింత జనం అక్కడ తినడానికి ఎగబడ్డారు.

ట్రాఫిక్ పోలీసులు ఆమె స్ట్రీట్ ఫుడ్ ను  తొలగించడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో  సీఎం రేవంత్ రెడ్డి  స్పందించి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

ట్రాఫిక్ పోలీసుల అనుమతితో ఆమె జనవరి 31వ తేదీ మధ్యాహ్నం హోటల్ ఓపెన్ చేసింది ఈ విషయం తెలుసుకున్న జనం.. భోజనం చేసేందుకు వందల సంఖ్యలో ఎగబడ్డారు.

తన పక్కన అందరూ వ్యాపారం చేసుకుంటుంటే తన ను మాత్రమే అమ్ముకోనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని నిన్న ఆమె కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే.  

 డీజీపీ ఆదేశాలతో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి,  కుమారీ  స్ట్రీట్ ఫుడ్ వద్ద ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూశారు.