OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న తెలుగు సినిమాలు ఇవే..

ఈ వీకెండ్‍లో ఓటీటీలో నయా తెలుగు సినిమాలు చూడాలనుకుంటున్న వారికి మరిన్ని చిత్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫిబ్రవరి మూడో వారంలో ముఖ్యంగా రెండు తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి.

నా సామిరంగ కింగ్ నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ చిత్రం సంక్రాంతికి థియేటర్లలో రిలీజై హిట్ అయింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 14న థియేటర్లలోకి వచ్చింది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 17వ తేదీన నా సామిరంగ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్టీమింగ్‍కు రానుంది.

నా సామిరంగ చిత్రంలో అషికా రంగనాథ్, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ఫిబ్రవరి 17 నుంచి చూసేయవచ్చు.

భామాకలాపం 2 సీనియర్ నటి ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ‘భామాకలాపం 2’ చిత్రం నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చేయనుంది. ఈ మూవీ ఫిబ్రవరి 16వ తేదీన ఆహాలో స్ట్రీమింగ్‍కు రానుంది. 2022లో వచ్చిన భామాకలాపం చిత్రానికి సీక్వెల్‍గా ఇప్పుడు భామాకలాపం 2 వస్తోంది.

ఈ మూవీలో శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్ కూడా కీలకపాత్రలు చేశారు. అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించిన ఈ మూవీకి ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం అందించారు. ఫిబ్రవరి 16 నుంచి ఆహాలో భామాకలాపం 2 వీక్షించవచ్చు. 

ది కేరళ స్టోరీ అత్యంత వివాదాస్పదమైన ది కేరళ స్టోరీ చిత్రం కూడా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 16వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. గతేడాది మేలో ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఇప్పుడు సుమారు 10 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. 

రూ.20 కోట్ల బడ్జెట్‍తో వచ్చిన ఈ కేరళ ఫైల్స్ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. అయితే, అత్యంత వివాదాస్పదం కూడా అయింది. ది కేరళ స్టోరీ చిత్రం జీ5లో ఫిబ్రవరి 16న తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులోకి రానుంది.