ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీల పరిస్థితి పేరు గొప్ప ఊరంతా ‘చెత్త’గా తయారైంది.కేంద్రం స్వచ్ఛ భారత్.. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ తెలంగాణ అని ప్రకటనలకే పరిమితమవడంతో ఉమ్మడి నల్లగొండ మున్సిపాలిటీలలో పరిశుభ్రతలో మార్పురావడం లేదు.
డంపింగ్ యార్డు పరిసర ప్రాంతల ప్రజలు నిత్యం రోగాలబారిన పడుతున్నారు. సేకరించిన చెత్తను తగలబెట్టడం లేదా చెరువులు,వాగుల్లో పోయడంతో స్థానికులు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నారు.
నల్గొండ జిల్లాలో 18 మున్సిపాలిటీలు ఉండగా, ఒకటి రెండు తప్ప మిగతా మున్సిపాలిటీల నిర్వహణ అస్తవ్యస్థంగా ఉంటోంది. జిల్లాల నుంచి నిత్యం 72 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి దానిని తగులబెట్టడంతో నిప్పులు చెలరేగడం, పొగకమ్ముకోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
వాస్తవానికి ఈ చెత్తద్వారా సేంద్రియ ఎరువులు,విద్యుత్ ఉత్పత్తి చేసి, ఆర్థికంగా లాభపడటమే కాకుండా ప్రజలకు అసౌకర్యం లేకుండా చేయవచ్చు.
అయితే పాలకుల నిర్లక్యం కారణంగా ప్రజలు దుర్వాసన, కాలుష్యంలో చిక్కుకొని సతమత మవుతున్నారు. కొదాడ..చండుర్... నకిరేకల్.. సూర్యాపేట...హుజుర్ నగర్ .. నందికొండ..నేరేడుచర్ల.. తిరుమల.... చిట్యాల పురపాలికల్లో డంపింగ్ యార్డ్ లే లేవ్వు...
చిట్యాల..కొదాడ... నందికొండ మినహా మిగతా ప్రాంతాల్లో ఊరు చివరి చెరువులు...వాగుల్లో వ్యర్థాలను పారబోస్తున్నారు.. దీంతో స్థానికులు లబోదిబో మంటున్నారు. అధికారులు ఇప్పటికైనా ఈ చెత్త సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.