తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. దుప్పలపూడిలోని ఈ కార్యక్రమం నిర్వహించారు. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు అందిస్తున్న వైద్య సౌకర్యం అన్ని కులాల వారికి అందించాలని ఎమ్మెల్యే సూచించారు. సేవాకార్యక్రమాలు చేయడంలో రెడ్డి సామాజికవర్గం ముందుంటుందని ఆయన కొనియాడారు. ఎమ్మెల్యే పోరాటపటిమ ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సెంట్రల్ కాటన్ బోర్డ్ మాజీ డైరెక్టర్ చింతలకుంట శ్రీనివాసరెడ్డి అన్నారు.
Discussion about this post