నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) అనేది భారతదేశంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు (MBBS/BDS) మరియు కొన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు (MD/MS) ప్రవేశం కోరుకునే విద్యార్థుల కోసం నిర్వహించబడే ఒక ప్రామాణిక పరీక్ష.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)చే నిర్వహించబడుతున్న NEET, దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఎంపిక ప్రక్రియను నిర్ధారిస్తూ, ఈ కోర్సులకు ఒకే ప్రవేశ పరీక్షగా పనిచేస్తుంది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి వివాదంలో ఉంది. పేపర్ లీక్ మరియు కొన్ని విద్యా బోర్డులు మరియు ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు, ప్రత్యేకించి ఆంగ్లంలో ప్రావీణ్యం ఉన్న విద్యార్థులకు అనుకూలంగా ఉండటం, తద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు లేదా ప్రాంతీయ భాషల్లో చదివిన విద్యార్థులు నష్టపోవటం వంటి పలు ఆరోపణలు దీనిపై ఉన్నాయి.
Discussion about this post