పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యానిమల్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ అనే సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్నారు.
స్పిరిట్ సినిమా అప్‌డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ లైన్‌కు సంబంధించి వార్ & హారర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వార్తలకు సందీప్‌రెడ్డి వంగా చెక్ పెట్టాడు. బాలీవుడ్ సినిమా ‘దుకాణ్’ టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో పాల్గొన్న సందీప్‌రెడ్డి ‘స్పిరిట్’ పై వస్తున్న వార్తలపై స్పందించాడు. నేను ప్రస్తుతం ప్రభాస్‌తో చేయబోయే ‘స్పిరిట్’ ప్రీ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నానని, సోషల్ మీడియాలో వస్తున్నట్లు ‘స్పిరిట్’ హారర్ లేదా వార్ స్టోరీ కాదని, ఇది ఒక నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ కథ అన్నారు. ఇక ఈ సినిమా కంప్లీట్ అయిన అనంతరం రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్ పార్క్’ చేస్తానన్నారు.
Discussion about this post