నిజామాబాద్ నగరంలో నేడు ఊరపండుగను ఘనంగా నిర్వహించనున్నారు. పాడిపంటలు, ప్రజలు సుఖశాంతులతో ఉండేలా దీవించాలని ప్రతియేట ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుతారు. సర్వ సమాజ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలో జరిగే ఈ పండుగలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారు. ఊరపండుగకు బండారు వేసిన రోజు నుంచి గ్రామ దేవతలైన అమ్మవార్లను పూజిస్తారు. ఆరాధ్య దేవతలైన గ్రామ దేవతను చక్కగా శిల్పులు చెక్కారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
Discussion about this post