టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి స్పష్టీకరణ
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన గెలిచి అధికారంలోకి రాగానే వై,ఎస్.జగన్ మోహన్ రెడ్డికి జైలు తప్పదని టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ అందరితో అడుకుంటున్నాడని విమర్శించారు. కార్మికులు, ఉద్యోగులతోనే కాకుండా .. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సొంత చెల్లి.. తల్లితో ఆడుకున్నాడని గుర్తు చేశారు. ల్యాండ్, సాండ్, మద్యం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయంలో పూర్తి ఆధారాలతో కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చెప్పారు.
Discussion about this post