ప్రపంచం నలుమూలలకు బెల్లం ఎగుమతులు చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న అనకాపల్లిలో పార్లమెంటు సీటు కేటాయింపుల కోసం రాజకీయపార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇటు కూటమి పార్టీలు అటు వైసీపీ అధిష్టానం సీటు ఎవరికి కేటాయించాలన్నదానిపై తర్జన భర్జనలు పడుతున్నాయి. పొత్తు పార్టీలలో బీజేపీ నుంచి పోటీ చేయడానికి సీఎం రమేష్ ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరుపుతున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన అభ్యర్థికి సీటు ఇచ్చేందుకు జగన్ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారన్న వార్తలున్నాయి.
Discussion about this post