కొంతమంది అధికారులు అవినీతిని కూడా సిస్టమాటిక్ గా చేస్తారు.. అలాంటి వారిలో పూనం మాలకొండయ్య నంబర్ వన్. ఆమె ఏమి చేసినా అడిగే వారులేరు. కేంద్రం లోనూ..రాష్ట్రంలోనూ ఆమె మాటకు తిరుగులేదు. ఆమె చేతలకు అడ్డుపడేవారే లేరు. అందుకే పూనం చెలరేగిపోతుంటారు. అడ్డు వస్తే చట్టాలను తుంగలో తొక్కేస్తారు. రూల్స్ ను ధిక్కరిస్తారు. అసలు రూల్స్ గురించి ఆమె ను హెచ్చరించేవారే లేరు . వైద్య శాఖను తన సొంత రాజ్యం గా మలుచుకున్న పూనమ్ “నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్లు ఇచ్చినా” అడిగే నాధుడే లేరు. ఉద్యోగాలు భర్తీ చేసినా ఇదేంటి తల్లి అని అడిగే సాహసం చేసినవారు లేరు. గౌరవ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో వైద్య శాఖలో జరిగిన అక్రమాలు … అన్యాయాలు ఆయన దృష్టికి వెళ్ళాయో లేదో ఎవరికి తెలియదు. తెలిసినా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆమెను ఏమి చేయరని సచివాలయ వర్గాలు అంటున్నాయి. ఇందుకు గతంలో జరిగిన విషయాలను ఉదహరిస్తున్నారు. ప్రభుత్వంలోని అత్యంత కీలక శాఖలో అక్రమ నియామకాలు జరగడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. వైద్య శాఖ అక్రమ నియామకాలపై ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ ఫోకస్..
విద్యా, వైద్యం తమ మొదటి ప్రాధాన్యమంటూ గౌరవ సీఎం జగన్ మోహన్ రెడ్డి..ప్రతి సందర్భంలో చెబుతుంటారు. పేదల వైద్యం కోసం ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడదని అంటుంటారు. ఏపీ ప్రభుత్వానికి వైద్యశాఖ ఎంత కీలకమో గౌరవ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు వింటేనే అర్థమైపోతుంది. అలాంటి వైద్యశాఖలో నోటిఫికేషన్ ఊసే లేకుండా, ఎవ్వరికీ మాటైనా చెప్పకుండా నచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి ? కానీ ఇచ్చేశారు పూనం మాలకొండయ్య. కింది స్థాయి ఉద్యోగాలే కదా ఎవరు పట్టించుకుంటారులే అని అనుకున్నారో ఏమో కానీ… ఇష్టం వచ్చిన వారికి నియామక పత్రాలు ఇచ్చేసి విధుల్లోకి తీసుకున్నారు. ఎవరు అడిగిన వారు లేరు.
ఈ అక్రమ నియామకాల్లో పూనం మాలకొండయ్యతో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. హెల్త్ సెక్రెటరీ కృష్ణబాబుతో పాటు హెల్త్ కమిషనర్ నివాస్ ఈ అక్రమనియామకాల్లో భాగం అయ్యారు. హెల్త్ కమిషనర్ నివాస్ చొరవతోనే అనర్హులు.. ఉద్యోగాల్లో చేరినట్లు అంటున్నారు . అయితే ఈ విషయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లిందా ? లేదా అనేది తెలీదు . తెలిసే గౌరవ సీఎం పట్టించుకోలేదా అనేది కూడా ఒక సందేహమే. నిజానికి పూనమ్‌పై వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు తీవ్ర ఆరోపణలు చేసింది. విశాఖలోని మెడ్‌టెక్ జోన్ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని కూడా కోరింది. అయితే అధికారంలోకి రాగానే పూనమ్‌కు స్పెషల్ సెక్రటరీ పోస్ట్ ను బహుమతిగా ఇచ్చారు..వాస్తవం చెప్పుకోవాలంటే ఆరోపణలున్న అధికారుల్లో ప్రభుత్వం టచ్ చేయని అతికొద్ది మందిలో పూనమ్ ఒకరు.
పూనమ్ మాలకొండయ్య కు వైద్య శాఖలో ఎక్కువ కాలం పనిచేసిన అనుభవం ఉంది. హెల్త్ కార్యదర్శిగా . కమిషనర్‌గా ,నేషనల్ హెల్త్ మిషన్ కార్యదర్శిగా పనిచేశారు. ఆ అనుభవం అంతా రంగరించి అవినీతికి తెర లేపారని అంటారు.
టీడీపీ హాయాంలో అప్పటి వైద్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్ సాగించిన అవినీతి వ్యవహారాల్లో పూనం మాలకొండయ్య సహకారం దండిగా ఉండేది అని ఇప్పటికి చెప్పుకుంటారు. పూనమ్ మీద సహ అధికారులే ఫిర్యాదులు చేశారని కూడా అంటారు. ప్రజల ప్రభుత్వంగా చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా పూనం మాలకొండయ్య తీరులో మార్పు లేదు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా భావించే వైద్యశాఖలో కీలక పదవిలో ఉంటునే ఆమె అక్రమాలకు పాల్పడుతున్నారు. నోటిఫికేషన్ లేకుండానే నియామకాలకు తెరలేపిన ఘనత పూనం మాలకొండయ్యకే దక్కింది.
ఇక ఆయుష్ అనుసంధానాన్ని చక్కగా వినియోగించుకొని కోవిడ్ సమయంలో ఎంబీబీఎస్ డాక్టర్లకు బదులు రాజకీయ నాయకుల సూచనలతో ఆయుర్వేద వైద్యులను ఇబ్బడి ముబ్బడిగా వైద్యశాఖలో తీసుకున్నారని అప్పట్లో పూనమ్ పై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం ఏదైనా వైద్యశాఖలో మాత్రం పూనం మాలకొండయ్య చక్రం తిప్పుతూనే ఉన్నారు. ప్రభుత్వంలో పూనం మాలకొండయ్యకు ఇంత పలుకుబడి ఉన్నా… వైద్యశాఖలో క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు లేదు. ఆమె అనుభవం ప్రజల కోసం ఉపయోగ పడలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు సమకూర్చడంలో వైద్యశాఖ పూర్తిగా విఫలమవుతోంది. కోవిడ్ టైమ్ లో కూడా నియామకాల్లో పూనం మాలకొండయ్య చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలున్నాయి. సంచార వైద్యబృందాల నియామకాలలో కూడా పూనం మాలకొండయ్య చేతివాటాన్ని ప్రదర్శించారని అప్పట్లో కొందరు మెడికోలు దుమ్మెత్తి పోశారు.
అసలు ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రూల్ అఫ్ రిజర్వేషన్ ను పాటించలేదు. ఇది పెద్ద ఉల్లంఘన.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో sc,STలు ఓబీసీ లకు వరుసగా 15%, 7.5%.. 27% చొప్పున రిజర్వేషన్ అమలు చేయాలి. అన్ని తెలిసిన అధికారి ఈ రూల్ అఫ్ రిజర్వేషన్ ను కూడా పక్కన బెట్టారనే విమర్శలున్నాయి. వైద్యశాఖలో పోస్టులు భర్తీ కోసం ఓ వైపు నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే… మరో వైపు గుట్టుచప్పుడు కాకుండా… నియమాకాలు చేపట్టారు పూనం మాలకొండయ్య. అక్రమంగా ఉద్యోగంలోని చేరిన వారు.. ఇప్పుడు వైద్యశాఖలో దిగువస్థాయి ఉద్యోగాల్లో పాతుకు పోయారు. ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో పూనం మాలకొండయ్య ఈ నియమకాలు చేపట్టినట్లు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అడ్డగోలు జీవోలతో గుట్టుచప్పుడు కాకుండా నియామకాలు చేపట్టారన్న విషయం వెలుగుచూడటంతో నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు.
ఓ వైపు సీఎం జగన్ వైద్యశాఖను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెబుతుంటే… మరో వైపు వైద్యశాఖను పూనం మాలకొండయ్య నీరుగారుస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. జిల్లా స్థాయిలోని ఆస్పత్రుల్లో డాక్టర్లు లేక వైద్యం సరిగ్గా అందక రోగులు అల్లాడిపోతున్నా… పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్శలున్నాయి. జిల్లా కేంద్రాల్లో కార్పొరేట్ ఆస్పత్రులు ఇష్టానుసారంగా రోగుల వద్ద నుంచి డబ్బులు దండుకుంటున్నా.. పూనం మాలకొండయ్య వాటి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఇటు వైద్యశాఖలో అటు ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇక ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న డయాగ్నటిక్ సెంటర్ల నియంత్రణ కు వైద్యశాఖ అధికారులు పూనుకోవడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.
నోటిఫికేషన్ లేని ఈ అక్రమ నియామకాల వ్యవహారంలో కోట్లు చేతులు మారాయని వైద్యశాఖలో ఇప్పటికీ చర్చ జరుగుతోంది. అయితే వైద్యశాఖలో ఇంత జరుగుతున్నా… పూనం మాలకొండయ్య చాలా సిన్సియర్ అధికారి అని చాలా మందే చెబుతున్నారు. బయటకు సిన్సియర్ గానే కనిపిస్తున్నా… లోపల మాత్రం అమాత్యుల ఆదేశాలకు అనుగుణంగానే పూనం మాలకొండయ్య వ్యవహరిస్తారని అంటున్నారు. పూనం మాలకొండయ్య చేపట్టిన ఈ అక్రమ నియామకాలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తమ అధికారిగా పేరు పొందిన పూనం మాలకొండయ్య.. ఇలా అక్రమ నియామకాలు లు చేపట్టడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గౌరవ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఈ అక్రమ నియామకాలపై చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని తొలగించి… ఆ పోస్టులను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఏపీ వైద్యఆరోగ్యశాఖలో కేవలం పూనం మాలకొండయ్య మాత్రమే.. కాదు మరికొందరు అవినీతి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు .
Discussion about this post