ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేధీ , రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ చేస్తారనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.గాంధీ కుటుంబంతో విడదీయరాని బంధం ఉన్న ఈ స్థానాల్లో తిరిగి వారే బరిలో ఉంటారా? ఇతరులను పోటీలో నిలుపుతారా? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే, పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి గాంధీ కుటుంబ సభ్యులు బరిలో ఉంటారని వెల్లడించారు.అమేధీ , రాయ్‌బరేలీ సీట్లపై నిర్ణయం వచ్చేవరకు వేచి చూడండి. ఎలాంటి ఊహాగానాలు వద్దు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారు” అని ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనీ తెలిపారు. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కూడా బరిలో ఉండే అవకాశం ఉందని వస్తున్న ఊహాగానాలపై ప్రశ్నించగా.. ”అలా జరగకపోవచ్చు” అని ఆయన బదులిచ్చారు.
Discussion about this post