హైదరాబాద్‌లోని పాతబస్తీలో కరెంట్ బిల్లుల వసూళ్లే అధికారులకు ప్రాణహానిగా మారింది. గతంలో బిల్లులు అడిగితే దాడులు చేయడం చూశాం. ఈ క్రమంలో బిల్లుల వసూలు బాధ్యతను అదానీ గ్రూపునకు అప్పగించారనే వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. రేవంత్ సర్కార్ అదానీకి కాంట్రాక్ట్ బాధ్యతలు అప్పగించిందా? అదే నిజమైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది. వినియోగదారులు బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లిన విద్యుత్తు కార్మికులపై దాడి చేయడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై బీఆర్‌ఎస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదానీ గ్రూపునకు బిల్లుల బాధ్యత ఇవ్వడం పాతబస్తీ ప్రజలను అవమానించడమేనని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. త్వరలో ఆందోళన తప్పదని హెచ్చరించారు.
Discussion about this post