విశాఖ కొమ్మాది చైతన్య కాలేజీలో డిప్లొమా విద్యార్థిని రూపశ్రీ అనుమానాస్పద మృతిపట్ల విద్యార్థి సంఘాలతో కలసి కుటుంబ సభ్యులు కాలేజీ ప్రధాన ద్వారం వద్ద నిరాహారదీక్షకు దిగారు. తమ కుమార్తె మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కంటికి రెప్పలా కాపాడుకున్న కుమార్తెను చైతన్య కళాశాల యాజమాన్యం పొట్టన పెట్టుకుందని మండిపడ్డారు. కళాశాలకు సంబంధించిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మీడియాలో వచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకున్న జాతీయ మానవ హక్కులు సంఘం రూపశ్రీ మృతిపట్ల దర్యాప్తు కొనసాగిస్తోంది.
Discussion about this post