సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం పోటీ చేసిన అభ్యర్థులలో గెలుపు ధీమాను పెంచుతోంది. నెల్లూరు జిల్లాలో సుమారు 78.1 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రాంతాల వారీగా పోలైన ఓట్ల శాతం తమకు అనుకూలమంటూ ప్రధాన పక్షాలు సైతం చేసే చర్చలు వార్తలకెక్కుతున్నాయి. నిన్నటి వరకూ ఎన్నికల ప్రచారం, పోలింగ్ నిర్వహణ, ప్రలోభాల పర్వంతో తలమునకలైన అభ్యర్థులు, నాయకులలో ఇప్పుడు అసలైన ఉత్కంఠ నెలకొంది. ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తోన్నారు. నెల్లూరు ఓటరు నాడి అందక సతమతం అవుతున్నారు..
పార్లమెంటు పరిధి, అభ్యర్థిత్వాల ప్రధాన్యంగా ఈ సారి ఎన్నికలు జరిగాయి. వైసీపీ పార్టీ వీడి ప్రత్యక్ష రాజకీయాలు సాగించాలను కొన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికలు సమీపించిన సందర్భంలో తెలుగుదేశం పక్షం వహించారు. పార్టీకి అన్ని విధాల బలాన్ని చేకూర్చే వేమిరెడ్డి ఎంపీ అభ్యర్థిగా రావడంతో టీడీపీలో జిల్లా వ్యాప్తంగా జోష్ పెరిగింది. ఇక వైసీపీ పార్టీలో రెండో స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి ని వెంటనే రంగంలోకి దింపింది .
వేమిరెడ్డి తిరోగమనంతో వైసీప జిల్లా ఆధ్యక్ష పదవికి ఎంపీ స్థానానికి కొరత ఏర్పడింది. జిల్లాలో సమన్వయం లేక ఎవరికివారు మీడియా ముందుకొచ్చి కామెంట్లు చేయడంతో పార్టీకి తీరని నష్టం ఏర్పడింది. అయినా ఇంటింటికీ బటన్ నొక్క మరీ నగదుచేర్చిన తమ నాయకుడి పాలనకు తిరుగులేదని, క్షేత్రస్థాయిలో బ్రహ్మరథం పడోతోన్నారన్న మితిమీరి ఆత్మవిశ్వాసంతో నాలు ఎలా అడితే ఆలా మట్లాడారు. ప్రతిపక్షమే కాదు స్వపక్షం లోనూ ఒకనొకరు దూషించుకొన్నారు. హేళన చేసుకొన్నారు. తీరా ఎనికలు వచ్చే టప్పటికీ సర్వేరిపోర్టులు మరీ వ్యతిరేఖంగా రావడంతో తికమక పడ్డారు. జిల్లాలో పరిస్థతిని చక్కదిద్దేందుకు పార్టీలోనే రెండో స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి ని పురమాయించారు. జిల్లాకు చెందిన విజయసాయి రెడ్డి నెల్లూరు తను గడిపిన రోజులు గుర్తు తెచ్చుకొని తరలివచ్చారు.
ఎంపీ అభ్యర్థిగా తొలిసారి ప్రత్యక్ష రాజకీయాలను తన సొంత జిల్లా నుంచే సాగించే అవకాశం లభించింది. ఆమేరకు రాజకీయంగా తన అనుభావాన్నివిజసాయి రెడ్డి పండిచారు. అసెంబ్లీ స్థానంలో ముగ్గుర సిటింగ్ ఎమ్మెల్యేలు, నెల్లూరు రూరల్ నుంచి పార్లమెటు సభ్యులుగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయడంతో విజయసాయి రెడ్డికి వారి ఖర్చులు తన సహకారాన్ని అందించే పనిలేకుండా పోయింది. తన ప్రచార సామాగ్రి, చివరలో ఎంపీ అభ్యర్థిత్వానికి చెందిన ఓటుకు అందించే నోటు విషయంలో మాత్రమే తన వంతు భాగస్వామ్యాన్ని అందించారు. మీడియా యాడ్ లను కూడా పార్లమెంటు పరిధి సింగ్ విడోగా చేసి తన ఆడిటింగ్ విధానాన్ని వినియోగించి ఖర్చు తగ్గించేశారు తెలివైన విజయసాయి. ప్రచార పర్వంలో పాల్గొనే వారికి దినసరి పేమెంటు గా ఇవ్వాల్సి వచ్చినా, తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల కు వచ్చిన తను ఎక్కడా తగ్గకుండా జనసందడిని చూపాల్సి వచ్చింది. అసెంబ్లీ సెగ్మెట్ పర్యటనలలో అభ్యర్థులు కొంత భారం వహించినా, ప్రచారంలో వారికి డిజిటల్ వాహనాలు ఓసమకూర్చడం, తన ఐప్యాక్ టీం తో సోషల్ మీడియాలో ప్రత్యర్థుల పోస్టింగ్ లు ఎదుర్కొవడం తదితర సదుపాయాలను కల్పించారు.
Discussion about this post