నెల్లూరు జిల్లా సర్వేపల్లి … బెజవాడ గోపాలరెడ్డి లాంటి మహామహుల్ని అసెంబ్లీకి పంపిన నియోజకవర్గం.. మొదటి నుంచి అక్కడ హేమాహేమీల్లాంటి నేతలే తలపడుతున్నారు. అయితే సర్వేపల్లి ప్రత్యేకత ఏటంటే ఇప్పటి దాకా ఎవరినీ మూడసారి ఎమ్మెల్యేగా గెలిపించలేదు అక్కడి ఓటర్లు .. ఈ సారి ఆ చరిత్ర తిరగరాయక తప్పని పరిస్థితి ఏర్పడింది సర్వేపల్లి వాసులకి.. టీడీపీ నుంచి పోటీలో ఉన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వైసీపీ అభ్యర్ధి మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి ఇద్దరూ మూడోసారి విజయం సాధించడానికి తలపడుతున్నారు .. మరి రాబోయే ఎన్నికల్లో సర్వేపల్లి ఎవరికి జై కొడుతుందో వేచి చూడాలి.
Discussion about this post