భారత్‌తో మిత్రదేశంగా ఉండే నేపాల్ బ్రిటిషర్ల కాలంనాటి నుంచి సాగుతున్న వివాదాన్ని తెరపైకి తెచ్చింది. నేపాల్ ముద్రించిన 100 రూపాయాల నోటు ఈ వివాదానికి దారితీస్తోంది. భారత్‌లోని ప్రాంతాలను తమ నోటుపై ప్రింట్ చేయడంతో చర్చనీయాంశమైంది. ఇరుదేశాల మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
కొత్త రూ.100 కరెన్సీలో భారత్‌లోని లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలను ప్రింట్ చేయనున్నట్లు నేపాల్ ప్రకటించడం వివాదాస్పదమైంది. బ్రిటిషర్ల కాలం నుంచే ఈ వివాదం ఉంది. కాలాపానీ ప్రాంతంలో ప్రవహించే కాళీ నది ఇరు దేశాలకూ సరిహద్దు. నేపాల్ రాజ్యానికి బ్రిటిషర్లకు మధ్య 1816లో తొలిసారిగా దీనిపై ఒప్పందం జరిగింది. కాళీ నది ప్రవాహ తీరులో మార్పు, నది పుట్టుకపై భిన్నవాదనలు సమస్యగా మారాయి.
నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో వివాదాస్పద భూభాగాలను నేపాల్ కొత్త మ్యాప్‌లో చేర్చాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి రేఖాశర్మ మీడియాకు తెలిపారు. ఈ భూభాగాలకు సంబంధించి ఇండియా-నేపాల్ మధ్య భిన్నాభిప్రాయలున్నాయి. వివాదాస్పద భూభాగాలతో కూడిన మ్యాప్‌ను నేపాలీ ముద్రిస్తోంది. ఇందుకోసం నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేపాల్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి రేఖా శర్మ తెలిపారు. ఏప్రిల్ 25, మే 2వ తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొత్త మ్యాప్ రీడిజైన్‌కు ఆమోదం లభించినట్లు ఆమె చెప్పారు.
లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలు నవంబర్ 2019లో భారత్‌మ్యాప్‌లో చేర్చారు. అవి ఇండియా తమ భూభాగాలుగా భావిస్తోంది. మే 2020లో నేపాల్ అదే భూభాగాలతో రాజకీయ మ్యాప్‌ను విడుదల చేసింది. దాంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. మే 8, 2020న లిపులేఖ్ మీదుగా కైలాష్ మానస సరోవరాన్ని కలిపేలా రహదారిని ప్రారంభించాలని భారత్ ప్రయత్నించింది. దాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్ భారత్‌కు నోట్‌ను పంపించింది. దాంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లా గుండా వెళ్లే రహదారి పూర్తిగా భారత భూభాగంలోనే ఉందని స్పష్టం చేసింది.
Discussion about this post