అనంతపురం అర్భన్ నియోజకవరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వైకుంఠ ప్రభాకర్ చౌదరికి తెలుగుదేశం పార్టీ చుక్కలు చూపుతోంది. 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2019లో వైసీపీ అనంత వెంకట్రామిరెడ్డి చేతిలో ఓడారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ చంద్రబాబు నుంచి హామీ రాకపోవడం ఆయనను కలవర పరుస్తోంది. టీడీపీ – జనసేన పొత్తులోభాగంగా ఈ సీటు జనసేనకు ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో14 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డానని, మరో రెండు మూడు రోజుల్లో తన భవిష్యత్ తేలిపోతుందని అనుచరులతో అన్నట్లు భోగట్టా..























Discussion about this post