సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏడో దశ పోలింగ్ ముగియడంతో 2024 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయింది. జూన్ 4న తుది ఫలితాలు ప్రకటించే ముందు,ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి శనివారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ను మనం చూసాం.. ప్రముఖ సంస్థలన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిపిన ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు ఖచ్చితంగా ఉండబోతున్నాయి అని తెలుసుకోవాలంటే మనం ఈ జూన్ 4వ తారీకు దాక వేచి చూడాల్సిందే .అయితే గతం లో ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు ఖచ్చితమైన అంచనాలను ఇచ్చాయి అనేది చూద్దాం .
2014 …2019 లోక్‌సభ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ..వాస్తవ ఫలితాలను గమనిస్తే 2014లో చాలా ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అధికారంలోకి వస్తుందని ముందే ఊహించాయి కానీ ఆ తర్వాత వచ్చిన అఖండ విజయాన్ని ఖచ్చితంగా అంచనా వేయడంలో విఫలమయ్యాయి. అప్పట్లో ఇండియా టుడే-సిసిరో: ఎన్డీఏకి 272 సీట్లు వస్తాయని అంచనా వేసింది… న్యూస్ 24-చాణక్య: 340 సీట్లు .. CNN-IBN-CSDS: 280 సీట్లు.. . టైమ్స్ నౌ ORG: 249 సీట్లు… ABP న్యూస్-నీల్సన్: 274 సీట్లు .. NDTV-హంస రీసెర్చ్: 279 సీట్లు బీజేపీ కి వస్తాయాని అంచనా వేసాయి.
ఇక ఇండియా టుడే-సిసిరో: యూపీఏకు 115 సీట్లు వస్తాయని అంచనా వేసింది…. న్యూస్ 24-చాణక్య: 101 సీట్లు…. CNN-IBN-CSDS: 97 సీట్లు… టైమ్స్ నౌ ORG: 148 సీట్లు… ABP న్యూస్-నీల్సన్: 97 సీట్లు…. NDTV-హంస రీసెర్చ్: 103 సీట్లు యూపీఏకి వస్తాయని అంచనా వేసాయి.
కానీ వాస్తవ ఫలితాలు వేరే విధంగా ఉన్నాయి..ఎన్డీయే 336 సీట్లు; బీజేపీ 282 సీట్లు గెలుచుకుంది .. UPA: 60 సీట్లు; కాంగ్రెస్ కేవలం 44 సీట్లు మాత్రమే గెలుచుకుంది
2019 లో ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే … ఇండియా టుడే-యాక్సిస్: 335నుంచి 365 సీట్లు… న్యూస్ 24-టుడేస్ చాణక్య: 350 సీట్లు …. News18-IPSOS: 336 సీట్లు … టైమ్స్ నౌ VMR: 306 సీట్లు….. ఇండియా TV-CNX: 300 సీట్లు…. సుదర్శన్ న్యూస్: 305 సీట్లు ఎన్డీఏ కి వస్తాయని అంచనావేసాయి. ఇండియా టుడే-యాక్సిస్: 77-108 సీట్లు యూపీఏ కి వస్తాయని అంచనా వేసింది. అలాగే న్యూస్ 24-టుడేస్ చాణక్య: 95 సీట్లు…. News18-IPSOS: 82 సీట్లు …. టైమ్స్ నౌ VMR: 132 సీట్లు… ఇండియా TV-CNX: 120 సీట్లు … సుదర్శన్ న్యూస్: 124 సీట్లు యూపీఏ కి వస్తాయని చెప్పాయి.
కానీ వాస్తవ ఫలితాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. … NDA: 352 సీట్లు గెలుచుకుంది. బీజేపీ ఒంటరిగా 303 సీట్లు సాధించింది.UPA: 91 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 52 సీట్లు గెలుచుకుంది.
2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ … కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్య ప్రత్యక్ష పోరు జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని అధికార బీజేపీ ప్రయత్నిస్తోంది. ఎన్‌డిఎ “400 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ 328..సీట్లలో పోటీ చేసి … సొంతంగా 200..కి పైగా సీట్లలో గెలుపును అంచనా వేస్తున్నది.. ఏ పార్టీ అంచానాలు ఫలిస్తాయో వేచి చూద్దాం.
Discussion about this post