ఐపీఎల్ 17వ సీజన్ ముగిసింది. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ వంతు వచ్చింది. ఇటీవలి IPL సీజన్లో చాలా మంది ఆటగాళ్ళు అద్భుతంగా ఆడగా… వారిలో కొందరికి T20 ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం కూడా లభించింది. అదే సమయంలో, టోర్నమెంట్లో నిరుత్సాహపరిచిన కొంతమంది ఆటగాళ్లు సైతం…ఇప్పుడు USA, వెస్టిండీస్‌లలో జరిగే ICC టోర్నమెంట్లలో ఆడుతున్నారు.
ఐపీఎల్లో ఫ్లాప్ అయిన కొందరు ఆటగాళ్లు…ఆ తర్వాత జరిగిన ఐసీసీ టోర్నీలో తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచారు. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ కావచ్చు. ఐపీఎల్ 2024లో ఫ్లాప్ అయిన ముగ్గురు ఆటగాళ్లు, టీ20 ప్రపంచ కప్ తొమ్మిదో ఎడిషన్‌లో అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024 ఫ్లాప్ అయిన ప్లేయర్లు టీ20 ప్రపంచకప్‌లో సంచలనం సృష్టించగల ప్లేయర్ల జాబితాను చూస్తే…
ఆఫ్ఘన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 ఫార్మాట్లో అత్యంత ప్రావీణుడైన స్పిన్ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచాడు. ప్రపంచవ్యాప్తంగా తన బౌలింగ్ నైపుణ్యాన్ని చూపించాడు. ఈ కుడిచేతి వాటం ఆటగాడికి టీ20 ప్రపంచకప్‌లో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 15 మ్యాచ్‌లలో 23 వికెట్లు తీసుకున్నాడు. అయితే… ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నప్పుడు రషీద్ చేసిన ప్రదర్శన అంచనాలకు విరుద్ధంగా ఉంది. అతను 12 మ్యాచ్‌ల్లో కేవలం 10 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. సగటు ప్రదర్శన ఉన్నప్పటికీ, రషీద్‌ను తక్కువ అంచనా వేయలేం. అతను టీ20 ప్రపంచ కప్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు.
ఆస్ట్రేలియా స్పిన్ ఆల్-రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ పొట్టి ఫార్మాట్లో బలమైన ఆటగాళ్ళలో ఒకరిగా పేరుగాంచాడు. అయితే… ఈసారి IPLలో అతని ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. అతను సీజన్ మధ్యలోనే సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. తన బ్యాట్‌తో 10 మ్యాచ్‌లలో కేవలం 52 పరుగులు మాత్రమే చేసి… బౌలింగ్‌లో 6 వికెట్లు తీయగలిగాడు. అయితే మాక్స్వెల్ లాంటి ఆటగాడిని ఎప్పుడూ తేలికగా తీసుకోలేం. అతను తన బ్యాటింగ్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చగలడు. 2024 టీ20 ప్రపంచ కప్‌లో అతని నుంచి ఆస్ట్రేలియా ఇలాంటి ప్రదర్శననే ఆశిస్తుంది.
ఐపీఎల్ 2024 భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు పీడకలగా మారింది. అతని కెప్టెన్సీలో, ముంబై ఇండియన్ లీగ్ దశ నుంచి నిష్క్రమించింది. అయితే, హార్దిక్ స్వయంగా బంతితోనూ, బ్యాట్‌తోనూ విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లో హార్దిక్ 14 మ్యాచుల్లో 216 పరుగులు చేసి బౌలింగ్‌లో 11 వికెట్లు మాత్రమే తీశాడు. అయినప్పటికీ, హార్దిక్ ఇంతకు ముందు టీ20 ప్రపంచ కప్‌లో కీలక సమయంలో తనను తాను నిరూపించుకున్నాడు. అతను పెద్ద టోర్నమెంట్లలో విభిన్న ఆటగాడిగా ఆడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో హార్దిక్ ఐపీఎల్లో నిరాశను మిగిల్చినా.. టీ20 ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Discussion about this post