కాలం విచిత్రమైంది. ఒక్కోసారి అమాంతం పైకి లేపుతుంది.. మరోసారి పాతాళానికి పడవేస్తుంది. ఉద్దండులైన రాజకీయ నాయకులు పీవీ నరసింహారావు, వాజ్ పేయీల కాలంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన వారు ప్రస్తుతం తిప్పలు పడుతున్నారు. జార్ఖండ్ లో జల్ .. జంగిల్.. జమీన్.. నినాదంతో ఉద్యమించి రాష్ట్రం సాధించి రెండు సార్లు ముఖ్యమంత్రయిన శిబూసోరెన్ క్రిమినల్ కేసుల్లో ఇరుక్కొని జైలుపాలయ్యారు. 2007లో ఆగస్టు 23న ట్రయల్ కోర్టు అతన్ని విడుదల చేసిందనుకోండి… రాష్ట్ర సీఎం అయిన అతని కుమారుడు హేమంత్ సోరెన్ 2024 జనవరి 31న అవినీతి భూ కుంభకోణం కేస్లుల్లో ఈడీ అరెస్టు చేసి జైల్లో పెట్టింది.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు పరిశ్రమించి తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా కేసీఆర్ పనిచేశారు. ఆయన హయాంలో కుటుంబ రాజకీయాలకు తెరలేపారని అపవాదుతో 2023లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కాగా, కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఘోర తప్పిదానికి పాల్పడిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగ నియామకాల్లోనూ విఫలమైందనే విమర్శలున్నాయి. భూ కుంభకోణాలకు కూడా పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న కేసీఆర్ కుటుంబానికి కాలం కలిసి వచ్చేనా ?
Discussion about this post