జగన్ ఐదేళ్ల పాలనలో బాదుడే బాదుడు. విధ్వంసకర పాలన కావాలా.. అభివృద్ధి చేసే పాలన కావాలా? సంక్షేమ పాలన కావాలా.. సంక్షోభ పాలన కావాలా? ఉద్యోగాలు లభించే పాలన కావాలా.. ఉన్మాద పాలన కావాలా? దారుణమైన రహదారులు కావాలా.. రహదారి భద్రత కావాలా? అప్పులు కావాలా.. సంపద సృష్టించే ప్రభుత్వం కావాలా? రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మే 13న ఆలోచించి ఓటేయండి.. కూటమిని గెలిపించండి. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఓటర్లకు విజ్ఞపి చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బహిరంగ సభల్లో పవన్,చంద్రబాబు కలసి పాల్గొన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు చెబుతున్నా.. సైకిల్ స్పీడుకు తిరుగులేదు.. గ్లాస్ జోరుకు ఎదురులేదు.. కమల వికాసానికి అడ్డే లేదు.. మా కాంబినేషన్ సూపర్. పవన్‌కల్యాణ్ కోట్లాది రూపాయల ఆదాయాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని మీకోసం వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
Discussion about this post