ప్రస్థుత రాజకీయాల్లో మహిళలకు ఉన్నత స్థానం కల్పించిన పార్టీ …జనసేన పార్టీయే అని ఆ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి అన్నారు. జనసేన పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించి, వైసీపిలో చేరిన చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు… చేగొండి సూర్యప్రకాష్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు.
విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సూర్యప్రకాష్ కు జనసేన పార్టీలో మంచి గుర్తింపునిచ్చినప్పటికీ… ఆయన స్వలాభం కోసం వేరే పార్టీలోకి మారారని, వీడిన పార్టీని, పార్టీ అధినేతలను విమర్శించడం సరికాదన్నారు. జనసేనలో నాయకులకు, మహిళలకు సరైన గుర్తింపు లేదని వ్యాఖ్యానించడం దారుణమన్నారు.
Discussion about this post