కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సర్వజనాసుపత్రిలో నాలుగు రోజుల మగ శిశువును అపహరించుకుపోయిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నయీమ్ అస్మి మాట్లాడుతూ.. రెండు గంటల వ్యవధిలో అపహరణకు గురైన శిశువును తల్లికి అప్పగించామని.. నిందితురాలు తమ్మిశెట్టి లక్ష్మీని జ్యూడిషియల్ రిమాండ్ కు పంపినట్టు తెలిపారు. నిందితురాలు లక్ష్మీపై గతంలో కేసులు ఏమన్నా ఉన్నాయనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నమన్నారు. అనంతరం కేసును చేదించిన పోలీసులకు నగదు రివార్డులను ఎస్పీ అందజేశారు.
Discussion about this post