హామీలు నెరేవేరేవరకు పోరాడతామని స్పష్టీకరణ
ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నెల్లూరులోని మున్సిపల్ అసంఘటిత కార్మికులు, అంగన్ వాడీలు, సర్వశిక్ష అభియాన్ అసంఘటిత ఉద్యోగులు సంయుక్తంగా ఆందోళన చేపట్టారు. నిరవధిక సమ్మెలో ఉన్న వారంతా కలిసి కలక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించి మహా ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ మొండి వైఖరి మారకపోతే అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.
ఎన్నికలకు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే ఇంటికి పంపుతామని ఆందోళనకారులు స్పష్టం చేశారు. ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కామాక్షమ్మ , మున్సిపల్ అసంఘటిత ఉద్యోగి కార్మికుల జీతాల విషయంలో రాష్ట్ర కేబినెట్ అబద్దాలు చెబుతోందని సిఐటీయూ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ విమర్శించారు. ఏపీలో కన్నా చాలా రాష్ట్రాల్లో ఎక్కువ జీతాలు ఇస్తున్నాయన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపొతే జనవరి రెండు నుంచి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అజయ్ కుమార్, సిఐటీయూ జిల్లా కార్యదర్శి తమను రెగ్యులర్ చేస్తామని సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు హామీ ఇచ్చారని.. కానీ ఇంతవరకు చేయలేదని సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాపోయారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమకు ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు.
Discussion about this post