తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో శరత్ కుమార్ ఈ ప్రకటన చేశారు. తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో కలిసి శరత్‌కుమార్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం చెన్నైలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఐకమత్యంతో పాటు ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా ప్రధాని మోదీ దేశాన్ని నడిపిస్తున్నారని కొనియాడారు. డ్రగ్స్ మహమ్మారిని తుదముట్టించి యువత సంక్షేమానికి మోదీ భరోసా ఇస్తున్నారని, 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తమ పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Discussion about this post