ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఓ తాజా నివేదిక ప్రకారం ప్రపంచ జనాభా 820 కోట్ల నుంచి దాదాపు 1003 కోట్లకు పెరుగుతుందని అంచనా. ప్రపంచ జనాభా దినోత్సవం జులై 11న విడుదల అయిన ‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్’ ప్రకారం, ఈ భూమిపై మనుషుల సంఖ్య, 2080 ల మధ్యలో గరిష్ట స్థాయికి చేరుకుని, ఆపై క్రమంగా క్షీణించడం ప్రారంభిస్తుందని కొత్త సర్వేలు చెప్తున్నాయి. ఇప్పుడు జన్మించే వ్యక్తులు సగటున 73.3 సంవత్సరాలు జీవిస్తారని, 1995 నుంచి సగటు జీవిత కాలం 8.4 సంవత్సరాలు పెరిగిందని ఈ నివేదిక అంచనా వేసింది. అర్ధ శతాబ్దానికి పైగా, ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల జనగణన గణాంకాలు, జనన మరణాల రేట్లు, ఇతర డెమోగ్రఫిక్ సర్వేల సహాయంతో ప్రపంచ జనాభా అంచనాలను రూపొందిస్తున్నాయి. డెమోగ్రఫీ అనేది మానవ జనాభాలో మార్పులను సూచించే గణాంకాల అధ్యయనం. ఈ భూగ్రహం మీద ఉన్న మనుషుల సంఖ్యను కచ్చితంగా లెక్కించడం సాధ్యం కాదు,” అని డెమోగ్రాఫర్ జాకబ్ బిజాక్ అన్నారు. కచ్చితమైన అంచనా వేయడానికి మా దగ్గర మంత్రాలు లేవు” అని వాషింగ్టన్ డీసీలోని పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో పరిశోధనా సంస్థలోని జనాభా అంచనా నిపుణులు డాక్టర్ తోషికో కనెడా అంటున్నారు. కానీ, జనాభా అంచనాలు, భవిష్యత్తు అంచనాల విషయానికి వస్తే జనాభా శాస్త్రవేత్తలు సంఖ్యలను గాలిలోంచి సృష్టిస్తారని దీని అర్థం కాదు. ఇది మన అనుభవం, జ్ఞానం. మనకు అందుబాటులో ఉన్న ప్రతి చిన్న సమాచారం ఆధారంగా కష్టపడి ఆలోచించడం. ఇది చాలా శ్రమతో కూడిన పని. అని డాక్టర్ కనెడా వివరించారు. 126 దేశాలు, ప్రాంతాలలోని జనాభా మరో మూడు దశాబ్దాల పాటు పెరుగుతుంది. వీటిలో భారతదేశం, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్తాన్, అమెరికా వంటి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు కొన్ని ఉన్నాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కొద్దిగా క్షీణించిన తర్వాత, అంతర్జాతీయ ఆయుర్దాయం మళ్లీ పెరుగుతోందని ఈ నివేదిక ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించింది. మరణాల రేటులో మరింత తగ్గుదలతో, 2054లో ప్రపంచవ్యాప్తంగా సగటు జీవిత కాలం 77.4 సంవత్సరాలకు చేరుకుంటుంది. అని మరో నివేదిక పేర్కొంది.
Discussion about this post