ఆంధ్రప్రదేశ్ లోని నందిగామకు చెందిన 4 నెలల శిశువు కైవల్య తన అమోఘ జ్ఞాపకశక్తితో ప్రపంచ రికార్డు సృష్టించింది. పక్షులు, కూరగాయలు, జంతువులు, ఫోటోల వంటి 120 రకాల వస్తువులను గుర్తించి నోబెల్ వరల్డ్ రికార్డ్ నుంచి ప్రత్యేక సర్టిఫికేట్ పొందింది. పాపలోని అసామాన్యమైన తెలివితేటల్ని గుర్తించిన తల్లి హేమ తన కూతురు కైవల్య సామర్థ్యాలను ప్రదర్శించే వీడియోను రికార్డ్ చేసి నోబుల్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపారు. అందరిలాగే వారు కూడా ఆశ్చర్యానికి లోనై పాప టాలెంట్ కు స్పెషల్ సర్టిఫికేట్ పంపారు. దీంతో ఆకుంటుంబం సంతోష సంబరాల్లో మునిగిపోయింది.
Discussion about this post