మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గండి మైసమ్మ లోని MREC క్యాంపస్ లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అన్నంతో పాటు పెట్టిన స్వీట్ లో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ఇటీవల కూడా మల్లారెడ్డి కాలేజ్ లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు, విద్యార్థి సంఘాల ధర్నాలు చేశారు. దీంతో ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని, విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెడతామని కాలేజీ చైర్మన్ మల్లారెడ్డి హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. అయితే, కొద్ది రోజులకే మళ్లీ అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి వచ్చేంత వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దీంతో క్యాంపస్ లో ఉద్రిక్తత నెలకొంది.
Discussion about this post