ప్రముఖ రీసెర్చ్ సంస్థ ది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR ప్రతి సోమవారం ఇస్త్రీలేని డ్రెస్ వేసుకోవాల్సిందిగా తన సిబ్బందిని కోరింది. మే 1 నుంచి 15 వరకు శుభ్రతా పక్షోత్సవాల్లో భాగంగా ‘ముడతలు కూడా మంచివే’ అన్న ప్రచారాన్ని ఆ సంస్థ ప్రారంభించింది. దీనిపై మరింత సమాచారం మీ కోసం..
అంతకు ముందు థాంక్ గాడ్ ఇది శుక్రవారం లేదా క్యాజువల్ ఫ్రైడే అంటూ చాలా కార్పొరేట్ సంస్థలు డ్రస్ కోడ్ కు ఆరోజు బై..బై చెప్పేవి. సెమీఫార్మల్ ధరించి రిలాక్స్డ్ గా పని చేసేవారు. ప్రస్తుతం ఈ 15 రోజులు ‘WAH అంటే ‘రింకిల్స్ అచ్చే హై’ పేరుతో ఇస్ర్తీ చేయని బట్టలు ధరించి పర్యావరణంలో పెను మార్పులను అడ్డుకోవాలని CSIR కోరింది. ఆ సంస్థలో మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ డాక్టర్. ఎన్ కళై సెల్వి ఆధ్వర్యంలో పర్యావరణపై అక్షరాస్యత, అవగాహన కలిగించే ప్రచారం చేపట్టారు. ఒక్క జత బట్టలు ఇస్త్రీ చేస్తే 200 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుందని ఆమె తెలిపారు. వారంలో ఒక్కరోజు ఇస్ర్తీ చేయని బట్టలు వేసుకుంటే ప్రతి ఒక్కరూ 200 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్ ను తగ్గించిన వారమవుతామన్నారు.
విద్యుత్ ను ఆదా చేసే ప్రక్రియలో భాగంగా, CSIR దేశంలోని అన్ని ల్యాబ్‌లలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి కొన్ని ప్రామాణిక విధానాలను అమలు చేస్తోంది. కార్యాలయంలో విద్యుత్ ఛార్జీలను 10 శాతం తగ్గించడం ప్రారంభ లక్ష్యంగా జూన్-ఆగస్టు 2024లో పైలెట్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు.దేశంలోనే అతిపెద్ద వాతావరణ గడియారాన్ని CSIR headquarter అయిన ఢిల్లీలోని రఫీ మార్గ్ లో ఏర్పాటు చేశారు. భూగోళాన్ని పరిరక్షించుకోవడానికి CSIR తన వంతు కృషి చేస్తోందని డాక్టర్. కళైసెల్వి తెలిపారు.
Discussion about this post