తణుకు నియోజవర్గంలో జరిగిన ప్రజా గళం బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్ పై కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కనుమూరు సునీల్ కుమార్ వారిపై ఫైర్ అయ్యారు. దమ్ముంటే చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ హైదరాబాదులో నాకు స్టీల్ ప్లాంట్ లు ఉంటే రుజువు చేసి చూపిస్తే.. శాశ్వతంగా రాజకీయంలో నుంచి తప్పుకుంటానని,అది రుజువు చేయలేకపోతే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. రాజకీయాల్లో మీరు ఏం చేస్తారు ? యువతకి ఏం చేస్తారో చెప్పండి.. అంతేకాని ఎవరో స్కిప్ట్ ఇచ్చేస్తే అది చదివేయడం, వ్యక్తిగతంగా రెచ్చగొట్టడం కాదని హెచ్చరించారు. తణుకులో జనసేన అభ్యర్థిగా విడువాడ రామచంద్రాన్ని ప్రకటించి మళ్లీ టిడిపి అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు దీన్ని తడి గుడ్డతో గొంతు కోశారనరా ? అదేనా రాజకీయమని సునీల్ కుమార్ ఘాటైన విమర్శలు చేశారు.
Discussion about this post