నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విశ్రాంత ఐఎఎస్ అధికారి కోప్పోలు, కోవూరు శాసనభ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి లను పరిచయం చేశారు. ప్రశ్నించిన వారిని ఇబ్బందులకు గురిచేస్తోన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జనాకర్షణ పథకాలకు పరిమితమైందన్నారు. విభజన తర్వాత పాలనను అందించిన చంద్రబాబు ప్రత్యేక హోదాను తేలేక పోయారన్నారు. సంపూర్ణ మద్య నిషేదాన్ని అంచెలంచలుగా అమలుచేస్తానన్న జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని ప్రభుత్వం ద్వారానే విక్రయిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు నిర్థిష్టమైన అభివృద్ది కాంగ్రేస్ తో సాధ్య మన్నారు. కాంగ్రేస్ పార్టీ కి ఓటేసి అభివృద్దిని అందుకోవాలని పిలుపునిచ్చారు.
Discussion about this post