శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేది వైసిపి పార్టీయేనని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో విసృతంగా పర్యటిస్తూ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో ఈ నియోజక వర్గం అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందని, కానీ జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధిలో దూసుకెళ్తుందని పిరియా విజయ అన్నారు.
Discussion about this post