గద్వాల్ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవతో పాటు 14 మంది కౌన్సిలర్లు, గద్వాల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జోగులాంబ కొల్లాపూర్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీమతి సరిత తిరుపతయ్య ఆధ్వర్యంలో మంత్రి జూపల్లి సమక్షంలో ఈ తతంగం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్రం, జిల్లాలో అభివృద్ధి జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్లు అమలు చేస్తున్నామని త్వరలో పూర్తిగా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మంత్రి అన్నారు.
Discussion about this post