భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇవాళ తులం ఎంతంటే!

బంగారం, వెండి ధరలు ఈ మధ్య కాలంలో భగభగమండి నిప్పులు కురిపించింది. పశ్చిమాసియా దేశాల్లో నెలకున్న ఆందోళనకర పరిస్థితులు విలువైన లోహాల విలువను అమాంతం పెంచుతున్నాయి.

అమెరికా, ఇజ్రాయిల్‌-ఇరాన్‌ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు అలర్ట్ అవుతున్నారు. పెట్టుబడులను సేఫ్ హెవన్ ఆస్తుల వైపు తరలిస్తున్నారు. అయితే ఈ దాడుల మధ్య డాలర్ విలువ పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులను మళ్లీ అటు మళ్లించారు.

దీంతో బంగారం ధరలు రెండు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. అయితే వార్ ఇంకా వారాల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున పసిడి రేట్లు ఎలా ఉంటాయో అంతు చిక్కడం లేదు. బంగారం ధరలు భవిష్యత్తులో పెరుగుతాయా లేక తగ్గుతాయా అనే దానిపై క్లారిటీ రావడం లేదు.

నిపుణులు మాత్రం బంగారం ధరలు భారీగా ఎగసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రూ. రెండు లక్షల వరకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ అంచనాల మధ్య పసిడి ధరలు ఈ రోజు సామాన్యులకు ఊరటనిస్తూ కాస్త తగ్గుముఖం పట్టాయి.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,510కు చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే దాదాపుగా రూ.2,580 తగ్గింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,56,300కు చేరింది. దాదాపు రూ.2,350 తగ్గింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,880కి చేరింది. అంటే దాదాపుగా రూ. 1930 వరకు తగ్గింది. ఇక వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది.

కేజీ వెండి ధరపై రూ. 10 వేలు తగ్గింది. ప్రస్తుతం రూ. 3.15 లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం తులం వెండి రూ. 315 వద్ద ఉంది. యుద్ధం ఇలానే కొనసాగితే బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇప్పుడు అమెరికా-ఇరాన్ యుద్ధం గోల్డ్, సిల్వర్ రేట్స్‌ను ప్రభావితం చేయనున్నాయి. భారత స్టాక్ మార్కెట్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈక్విటీ మార్కెట్స్ సోమవారం రోజు కుప్పకూలే అవకాశం ఉంది.

యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మాత్రం మార్కెట్లకు నష్టమే. అంతేకాకుండా గోల్డ్, సిల్వర్ రేట్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆల్ టైమ్ హైకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Follow for more updates.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *