సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..ముహూర్తం ఫిక్స్ !

విజయ్ మార్క్ మేజిక్ తమిళనాడులో మొదలైంది. ప్రధాన పార్టీలకు భారీ షాక్ లు తప్పటం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం విజయ్ సాధించారు. విజయ్ ను సీఎం చేసేందుకు పలు పార్టీలు ముందుకు వచ్చాయి. అయితే..

విజయ్ అందరికీ ఆమోదం తెలపలేదు. ఎంపిక చేసిన పార్టీలతోనే కలిసి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండే పార్టీలను ఖరారు చేసారు. దీంతో.. టీవీకే కూటమి బలం 126కు చేరింది. సీఎంగా ప్రమాణ స్వీకారం పైనా నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. 108 స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన టీవీకేను ప్రభుత్వానికి ఆహ్వానించాలంటే.. ముందుగానే మెజార్టీ లెక్కలు ఇవ్వాలి అంటూ లోక్ భవన్ స్పష్టం చేసింది. దీంతో.. తనకు మద్దతు ఇచ్చే పార్టీల నేతలతో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ తో విజయ్ భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని డిసైడ్ అయ్యారు.

మధ్యాహ్నం గవర్నర్ తో భేటీ తరువాత అధికారికంగా ప్రకటన చేయనున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారం వేళ డీఎంకే- అన్నా డీఎంకేకు భారీ షాక్ లు తగులుతున్నాయి. డీఎంకేలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ విజయ్ తో చేతులు కలిపేందుకు సిద్దమైంది. దీని పైన డీఎంకే నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. వెన్నుపోటు రాజకీయాలంటూ విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్డీఏ కూటమిలోని పార్టీలు కూటమిని వదిలి విజయ్ తో కలిసేందుకు సిద్ధమయ్యాయి.

234 స్థానాల రాష్ట్ర అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 118 స్థానాలు అవసరం కాగా.. విజయ్‌ పార్టీ 10 సీట్ల దూరంలో నిలిచింది. దీంతో కాంగ్రెస్‌, పీఎంకే, వామపక్షాల మద్దతు కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్‌ 5 సీట్లు, సీపీఎం రెండు, సీపీఐకి రెండు, వీసీకేకి రెండు సీట్లతో పాటు అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకేకి ఉన్న 4 సీట్లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ సిద్దం అయ్యారు. డీఎంకే – అన్నాడీఎంకే నుంచి కొందరు ఎమ్మెల్యేలు టచ్ లోకి వస్తున్నారు. అయితే, వారిని చేర్చుకోవటం పైన విజయ్ ఇప్పటికైతే సుముఖంగా లేరు. విజయ్ కు మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక కనిపిస్తోంది. డీఎంకే కాంగ్రెస్ నిర్ణయంతో విభేదిస్తోంది. దీంతో… విజయ్ ప్రమాణ స్వీకారం వేళ తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

  • విజయ్‎కు మద్దతు ఇచ్చే పార్టీలపై ఉత్కంఠ
  • ఇప్పటికే విజయ్‎కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్
  • ఇతర పార్టీలతో సంప్రదింపులు చేపట్టిన టీవీకే
  • వీసీకే, వామపక్షాలకు లేఖ రాసిన టీవీకే
  • అన్నాడీఎంకే నుంచి 40 మంది మద్దతు ఇచ్చేందుకు రెడీ..?
  • విజయ్ ఎవరి సపోర్ట్ తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ
  • రేపు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్న విజయ్
  • మధ్యాహ్నం 3 గంటలకు విజయ్‎కు గవర్నర్ అపాయింట్‎మెంట్

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top