వస్తావా? రేటెంత? అంటూ ఆకతాయిల వేధింపులు..

పోకిరీలు ఆమెను వేధించినట్లు సమాచారం. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఆమె అక్కడే ఉండి మహిళలు ఎదుర్కొనే వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ ఆపరేషన్‌లో కమిషనర్ సుమతిని సుమారు 40 మంది యువకులు ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది.

దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ప్రాంతంలో మహిళల భద్రతపై వరుస ఫిర్యాదులు రావడంతో కమిషనర్ సుమతి మూడు రోజుల పాటు స్వయంగా నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో అనుమానాస్పదంగా తిరిగేవారిని గుర్తించడం, మహిళలను వేధించే యువకులపై నిఘా పెట్టడం, రాత్రివేళల్లో భద్రతా పరిస్థితులను పరిశీలించినట్లు తెలుస్తోంది.

పోలీసుల ప్రాథమిక విచారణలో.. కొందరు యువకులు మద్యం మత్తులో ఉండటం, మరికొందరు గంజాయి మత్తులో తిరగడం, రాత్రివేళల్లో మహిళలను ఇబ్బంది పెట్టడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆపరేషన్ అనంతరం పోలీసులు 40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. పోలీసులు యువకులను ప్రశ్నిస్తూ.. చదువుకునే వయసులో ఇలాంటి చర్యలు ఎందుకు?, మహిళలను వేధించడం వల్ల కలిగే నష్టాలు, చట్టపరమైన పరిణామాల గురించి అవగాహన కల్పించినట్లు సమాచారం.

దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో అధిక సంఖ్యలో హాస్టల్స్ ఉండటంతో రాత్రి వేళల్లో యువకుల సంచారం ఎక్కువగా ఉంటోందని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ హాస్టల్స్, విద్యార్థుల నివాసాలు ఎక్కువగా ఉండటంతో రాత్రి సమయంలో అల్లరి మూకలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

  • మార్క్ చూపించిన మల్కాజ్‎గిరి సీపీ సుమతి!
  • దిల్‎సుఖ్‎నగర్‎లో పోకిరీలకు దిమ్మతిరిగే షాక్!
  • కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్న IPS సుమతి
  • సుమతిని చుట్టుముట్టిన పోకిరీలు
  • వస్తావా? రేటెంత? అంటూ అసభ్యకర మాటలతో వేధింపులు
  • అర్ధరాత్రి 12 నుంచి ఉ.3.30వరకు స్పెషల్ ఆపరేషన్
  • 40మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • స్పెషల్ ఆపరేషన్‎లో పట్టుబడ్డవారంతా విద్యార్థులు, ఉద్యోగులే

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top