ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్…మెంటల్ ఎక్కిస్తున్న స్పిరిట్ మూవీ…

రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో సినిమాల వరుస చూసి ఫ్యాన్స్ ఒకప్పుడు ఉత్సాహంలో మునిగిపోయారు. కానీ ఇప్పుడు అదే లైనప్ ఆందోళనను పెంచుతోంది.

బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ వస్తాయన్న ఆశ ఇప్పుడు ఎప్పుడు వస్తాయోనన్న అన్న ప్రశ్నగా మారిపోయింది. టాప్ డైరెక్టర్లతో భారీ ప్రాజెక్టులు చేస్తున్న ప్రభాస్, ఒకవైపు షూటింగ్స్‌కి డేట్స్ ఇస్తూ, మరోవైపు గ్యాప్ దొరికితే విదేశీ విహారాలకు వెళ్తున్నాడన్న చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ షెడ్యూల్ మేనేజ్‌మెంట్ గందరగోళం కారణంగా సినిమాల టైమ్‌లైన్స్ పూర్తిగా దెబ్బతింటున్నాయి.

ఒకే నెలలో రెండు మూడు సినిమాలకు డేట్స్ ఇవ్వడం తో మిగతా సినిమాలపై ఎఫెక్ట్ పడుతోంది. ప్రెజెంట్ ఫౌజీ షూటింగ్ కారణంగా సందీప్ వంగాతో చేస్తున్న స్పిరిట్ కు బ్రేక పడింది. ఇదే టైమ్‌లో ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌కి కూడా ఆయన డేట్స్ ఇచ్చారు. అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్ పై ఇంపార్టెంట్ సీన్స్ ను షూట్ చేయనున్నారట. దీంతో సందీప్ వంగా సినిమాకు ఉహించని షాక్ తగులుతోంది. దీంతో షూటింగ్ మరింత ఆలస్యం అవుతుండటంతో సినిమాను వాయిదా వేయాలనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది.

నిజానికి ‘స్పిరిట్’ మూవీని 2027 మార్చిలో రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వర్కౌట్ అయ్యేలా లేదు. ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాల షెడ్యూల్స్, స్పిరిట్ షూటింగ్ డిలే అవుతుండటంతో.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను 2027 డిసెంబర్ 1కి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు.’యానిమల్’ రిలీజ్ అయింది కూడా సరిగ్గా ఆ రోజే. దీంతో సెంటిమెంట్ ప్రకారం ఆ రోజే సినిమాను రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారట సందీప్ వంగా..

Follow for more updates.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top