ప్రతి యేటా ఆర్మాక్స్ సంస్థ టాప్ టెన్ స్టార్స్ లిస్ట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది… ఈ సారి మేల్ స్టార్స్ లో నాలుగో సారి నంబర్ వన్ గా నిలిచారు రెబల్ స్టార్…

ఫిమేల్ స్టార్స్ లిస్ట్ లో సమంత అగ్రస్థానం దక్కించుకున్నారు… ఇంతకూ ఎవరెవరు ఏ ప్లేసెస్ లో ఉన్నారో మరి !?…
ప్రస్తుతం తెలుగునేలపై ఎక్కడ చూసినా యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రచ్చ సాగుతోంది… ఎందుకంటే ఒక్క రోజు తేడాతో ఈ ఇద్దరు స్టార్స్ సినిమాల ట్రైలర్, గ్లింప్స్ రిలీజయ్యాయి… దాంతో ఫ్యాన్స్ వీటి గురించే ముచ్చటించుకుంటున్నారు… అయితే ఆర్మాక్స్ ఈ ఏడాది మార్చి దాకా నిర్వహించిన సర్వేలో మాత్రం ఈ ఇద్దరు స్టార్స్ అసలు ‘టాప్ ఫైవ్’లోనే చోటు దక్కించుకోలేదు…
ఆరో స్థానంలో రామ్ చరణ్ నిలవగా, తొమ్మిదిలో యన్టీఆర్ ఉన్నారు… ఇక టాప్ ఫైవ్ లో ఉన్న స్టార్స్ ఎవరంటే నంబర్ వన్ ప్లేస్ లో ప్రభాస్, రెండో స్థానంలో అల్లు అర్జున్, మూడులో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, నాలుగో స్థానంలో షారుఖ్, ఐదులో మహేశ్ బాబు ఉన్నారు… వరుసగా నాలుగో సారి ప్రభాస్ నంబర్ వన్ ప్లేస్ లో నిలవడం విశేషంగా మారింది…
ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే సమంత రూత్ ప్రభు కూడా గత ఏడాది లాగే తన నంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నారు… ఆమె తరువాతి స్థానాల్లో వరుసగా అలియా భట్, రశ్మిక మందణ్ణ, దీపికా పడుకోణె, కాజల్ అగర్వాల్, సాయి పల్లవి, నయనతార, త్రిష, కృతి సనన్, శ్రీలీల నిలిచారు… చిత్రమేంటంటే ఇప్పుడు తమిళనాట వార్తల్లో విశేషంగా వినిపిస్తున్న త్రిష గత సంవత్సరం నాలుగో స్థానంలో ఉన్నారు…
ఈ సారి 9వ ప్లేస్ లో త్రిష నిలవడం గమనార్హం!… అలాగే పోయినసారి మూడో స్థానంలో ఉన్న కాజల్ ఈ సారి ఐదో స్థానానికి దిగారు… ఇంతకు ముందు ఏడో స్థానంలో ఉన్న రశ్మిక తాజా జాబితాలో మూడో స్థానం దక్కించుకోవడం విశేషం… పోయిన ఏడాది తొమ్మిదో ప్లేస్ లో నిలచిన కియారా అద్వాణీ ఈ సారి జాబితాలోనే లేదు… ఆమె ప్లేస్ లోకి కృతి సనన్ వచ్చారు… శ్రీలీల మాత్రం అప్పుడు, ఇప్పుడు పదో స్థానంలోనే ఉన్నారు… ఇలా హీరోయిన్స్ అటు ఇటయ్యారు…. అంతా బాగానే ఉంది… మరి ఈ యేడాది టాప్ టెన్ ఆర్మాక్స్ లిస్టులో మిగిలిన హీరోలు ఎవరు అన్నది కూడా చెప్పాలి కదా… అక్కడికే వద్దాం- విజయ్ ఎలక్షన్స్ లో కోలీవుడ్ లో సంచలనం సృష్టించారు… అయినా ఆయన మూడో స్థానంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది… ఏప్రిల్ దాకా సర్వే సాగి ఉంటే ఖచ్చితంగా తమ హీరో రామ్ చరణ్ మరింత ముందుకు సాగేవారని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు… అలాగే యన్టీఆర్ అభిమానులు కూడా చెబుతున్నారు… మిగిలిన స్టార్స్ లో సల్మాన్ ఖాన్ ఏడో స్థానంలోనూ, రణ్వీర్ సింగ్ ఆ తరువాతి ప్లేస్ లోనూ ఉన్నారు… పదో ప్లేస్ లో అక్షయ్ కుమార్ నిలిచారు… అయితే ఈ జాబితాలో ప్రభాస్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, రామ్ చరణ్, జూనియర్ యన్టీఆర్ – ఐదుమంది టాలీవుడ్ స్టార్స్ చోటు సంపాదించడం విశేషంగా మారింది… ఈ లిస్టులో నలుగురు బాలీవుడ్ స్టార్స్ ఉండగా, కోలీవుడ్ నుండి ఒకే ఒక్క విజయ్ చోటు దక్కించుకోవడం గమనార్హం !… వచ్చే యేడాది ఎవరి ప్లేస్ ఎలా మారుతుందో చూడాలి…
Follow for more updates
