తునిలో అదృశ్యమైన చిన్నారి ‘జ్ఞానేశ్వరి’ కేసుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది! అసలు ఆ చిన్నారిని వెతకడానికి పోలీసులు ఇప్పటివరకు ఏం చేశారో పూర్తి వివరాలు చెప్పాలని ఆదేశించింది.

మూడేళ్ల పసిగుడ్డు అదృశ్యమై ఇన్ని రోజులవుతున్నా ఎందుకు కనిపెట్టలేకపోయారని పోలీసుల తీరుపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు గాలింపు చర్యల్లో పూర్తిగా విఫలమయ్యారని, కనీసం క్లూస్ కూడా సంపాదించలేకపోయారని లాయర్ శ్రీకాంత్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దేశంలో ఎక్కడైనా పిల్లలు తప్పిపోయినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రత్యేక నిబంధనలను, ఎస్ఓపీలను తుని పోలీసులు అసలు పాటించారా లేదా అని హైకోర్టు గట్టిగా ప్రశ్నించింది.
మరోవైపు పోలీసుల తరపు న్యాయవాది స్పందిస్తూ.. బాలికను కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని, అన్ని కోణాల్లో తీవ్రంగా ప్రయత్నాలు సాగుతున్నాయని కోర్టుకు వివరించారు. ఏది ఏమైనా ఒక చిన్నారి ప్రాణం మరియు భద్రతకు సంబంధించిన ఈ కేసులో అలసత్వాన్ని సహించేది లేదని, పూర్తి వివరాలతో కోర్టు ముందుకు రావాలని న్యాయస్థానం ఆదేశించింది.
- చిన్నారి జ్ఞానేశ్వరి కోసం పోలీసులు ఏం చేశారు ? ప్రశ్నించిన హైకోర్టు!
- బాలిక ప్రస్తుత పరిస్థితిపై తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశం!
- పిల్లలు తప్పిపోయినప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించారా?
- పోలీసులు గాలింపులో విఫలమయ్యారంటూ లాయర్ శ్రీకాంత్ లంచ్ మోషన్ పిటిషన్!
- చిన్నారి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామన్న పోలీసుల తరపు న్యాయవాది!
Follow for more upates
