విజయవాడ దుర్గమ్మ దర్శనానికి సీఎం విజయ్.. కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు?
తమిళనాడు: సీఎం విజయ్ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ఆయన ఏపీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎంవో నుంచి అధికారులు, భద్రతా సిబ్బంది విజయవాడకు వచ్చి సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించారు. అయితే, సీఎం విజయ్ తన పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు.
విజయవాడ దుర్గమ్మ దర్శనానికి సీఎం విజయ్.. ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు
విజయ్ మధ్యామ్నం 2.30 గంటలకు నీలంకరై క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 3గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఏపీ ప్రభుత్వం తరపున విజయ్ కు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలకనున్నారు. ప్రధానంగా ఏపీ, తమిళనాడు రాష్ట్రాల మధ్య జల సంబంధిత అంశాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
ఇదే అంశంపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు తమిళనాడు సీఎం విజయ్ ఇవాళ విజయవాడకు రానున్నారు. ప్రధానంగా తెలుగు గంగ ప్రాజెక్టు నుంచి తమిళనాడుకు అందాల్సిన కృష్ణా జలాల వాటా, నీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. అదే సమయంలో గోదావరి–కృష్ణా–కావేరి నదుల అనుసంధానం అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. ఏపీ నిర్మించతలపెట్టిన డ్యామ్ల అంశంపైనా మాట్లాడే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విజయ్ కూడా కలిసే అవకాశం కనిపిస్తోంది.
Watch Full Story : https://youtu.be/5zDDrxgoJUs
దుర్గమ్మకు మొక్కిన సీఎం విజయ్.. విజయవాడ పర్యటనలో ఆసక్తికర దృశ్యాలు
భేటీ అనంతరం విజయ్ ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత విజయవాడలో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ 2.0లో విజయ్, చంద్రబాబు పాల్గొంటారు. విజయవాడ ఉత్సవ్ లో భాగంగా.. సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్ పున్నమి ఘాట్లో సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించనున్నారు. కాగా.. దసరా సంబరాలు అంబరాన్నంటేలా.. విజయవాడ ఉత్సవ్ 2.0 దుమ్మురేపుతోంది.. జానపద గేయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, స్పెషల్ ఆర్ట్ లతో.. మన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా చేస్తున్నారు.
