ఇరాన్ యుద్ధం..భగ్గుమన్న క్రూడ్ ఆయిల్ ధరలు

పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దీంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్క్‌ దాటేసింది. మూడున్నరేళ్లలో ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.

అమెరికా చమురు ధరలకు బెంచ్‌మార్క్‌గా ఉన్న వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్ ధర 106.22 డాలర్లు పలికింది. శుక్రవారం మార్కెట్లు ముగిసినప్పుడు ఆ రేటు 90.90 డాలర్లుగా ఉండగా.. తాజాగా 16.9 శాతం పెరిగింది. షికాగో మెర్కంటైల్ ఎక్స్ఛేంజీలో ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 16.5 శాతం పెరిగి.. 107.97 డాలర్లకు ఎగబాకింది. గతవారం అమెరికా క్రూడ్ ధర 36 శాతం, బ్రెంట్ క్రూడ్‌ 26 శాతం పెరిగాయి. ఆ ఎఫెక్టే ట్రేడింగ్‌లో కనిపించింది.

ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్‌-అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం రెండో వారమూ కొనసాగుతోంది. దాంతో పశ్చిమాసియాలో చమురు ఉత్పత్తి, షిప్పింగ్‌కు అంతరాయం కలుగుతోంది. మరోవైపు హర్మూజ్ జలసంధిని మూసివేశామని, నౌకలు దానిని దాటడానికి ప్రయత్నిస్తే నిప్పు పెడతామని ఇరాన్ హెచ్చరించింది. హర్మూజ్‌ ప్రపంచ ఇంధనానికి జీవనాడి వంటిది. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ జలసంధి నుంచి ప్రపంచం వాడే చమురులో ఐదోవంతు రవాణా అవుతోంది. ఇప్పుడు ఈ రవాణాకు ఆటంకం ఏర్పడింది.

చమురు ధరలు 100 డాలర్ల మార్క్ దాటి.. 120 డాలర్లకు చేరువవుతోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ పెట్టారు. ఇది అణుముప్పును తొలగించేందుకు ఇరాన్ చెల్లిస్తోన్న చిన్న మూల్యమని అన్నారు. ఈ ధరల పెరుగుదల తాత్కాలికమేనని.. ఆ ముప్పు తొలగిన తర్వాత ధరలు భారీగా పడిపోతాయని చెప్పారు. తెలివితక్కువవారే దీనికంటే భిన్నంగా ఆలోచిస్తారని వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న క్రూడ్ ఆయిల్ ధరలు వంద డాలర్లు దాటిన బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర నాలుగేళ్ల తర్వాత వంద డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ఒక్కరోజే 16 శాతం పెరిగిన ముడి చమురు వారంలోనే 33 డాలర్లకు పైగా పెరిగిన క్రూడ్ ఆయిల్ 70 డాలర్ల నుంచి ఏకంగా 109.14 డాలర్లకు క్రూడ్ ఆయిల్

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top