Crime News: సినిమాను మించిన క్రైమ్ సీన్.. భార్యను నరికి.. తలతో ఏం చేశాడో తెలిస్తే..

రోజురోజుకూ మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుంది. తాము మనుషులమని మరిచి నా అనుకున్న వాళ్లనే దారుణంగా చంపేస్తూ మృగాళ్లా క్రూరంగా తయారవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే చత్తీస్‌గడ్‌ జిల్లాలో వెలుగు చూసింది. 30 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి తన భార్యను అతికిరాతకంగా హత్య చేసి ఆమె తలతో గ్రామ వీధుల్లో తిరిగాడు. అది చూసిన గ్రామస్తులు భయంతో వణికిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీకున్నారు.

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను అతికిరాతకంగా హత్య చేసిన ఆమె తలతో గ్రామంలో ఓ వ్యక్తి సంచరించిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్‌గమార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుందేలి గ్రామంలో వెలులు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికింగా నివాసం ఉంటున్న సాలిక్ రామ్ యాదవ్ అనే 30 ఏళ్ల వ్యక్తికి కొన్నాళ్ల క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. అయితే గత కొన్నాళ్లగా భార్య భర్తల మధ్య వివాధాలు చెలరేగినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం సాలిక్ రామ్ తన భార్యను హత్య చేసి, ఆమె తలను వేరు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అయితే తెగిపడిన తలను అతను ఒక ప్లాస్టిక్ సంచిలో వేసుకుని గ్రామం మధ్యలోకి తీసుకెళ్లాడు. అక్కడ సంచిలో నుండి తలను బయటకు తీసి, జుట్టు పట్టుకుని చూపిస్తూ గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ భయంకర దృశ్యాన్ని చూసిన కొందరు స్థానికులు మొబైల్ ఫోన్లతో వీడియో తీయగా మరికొందరు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే స్థానికులు ఇందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ కిరాతకానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

భార్యభర్తల మధ్య సమస్యలొస్తే కలిసి సాల్వ్ చేసుకోవాలి కానీ ఇలా చంపుకుంటూ పోతే ఆ బంధానికి అర్థం ఏంటని ఓ యూజర్ కామెంట్ చేశారు. రోజురోజుకూ మనుషులు మరీ క్రూరంగా మారుతున్నారని మరో యూజర్ రాసుకొచ్చాడు.

ప్రియురాలి గొంతు కోసి.. యువకుడి ఆత్మహత్య

ఇదిలా ఉండా గత ఫిబ్రవరి నెలలోనూ కోర్బాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. వివాహేదతర సంబంధం కారణంగా బిలాస్‌పూర్‌కు చెందిన శుభమ్ నాయుడు అనే వ్యక్తి నిషా అలియాస్ ప్రతీక్ష అనే యువతిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఉర్గా పోలీస్ స్టేషన్ పరిధిలోని సాందేల్ గ్రామం వద్ద గల ఒక కల్వర్టు సమీపంలో శుభమ్, నిషా గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు.

అనంతరం ఆమె మరణించిందనుకొని అతను అక్కడే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచాడు. అయితే రక్తపు మడుగులో పడి ఉన్న నిషాను గుర్తించిన స్థానికులు ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top