ఢిల్లీలోని మాలవీయ నగర్‌లోని ఓ రెస్టారెంట్లో భారీ స్థాయిలో మంటలు చెలరేగి 21 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. గురుగ్రామ్‌లోని సెక్టార్ 46కు చెందిన వివేక్ అగర్వాల్ అనే చార్టర్డ్ అకౌంటెంట్ ఢిల్లీలోని మాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తన తండ్రిని పరామర్శించడానికి ఢిల్లీకి వచ్చారు. అతనితో పాటు అతని భార్య తర్జనీ అగర్వాల్, ఇద్దరు కుమార్తెలు జివిషా, వర్య మరో ముగ్గురు బంధువులు కూడా వచ్చారు. అయితే, అగ్నిప్రమాదం జరిగిన ఫ్లోరిష్ స్టే బెడ్-అండ్-బ్రేక్‌ఫాస్ట్‌లోనే వివేక్ రెండు గదులను బుక్ చేసుకున్నారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబం అంతా హోటల్ రెస్టారెంట్లో అల్పాహారం తీసుకుంటోంది. ఈ అగ్నిప్రమాదంలో మొత్తం ఏడుగురు మరణించారు. వివేక్ కుటుంబంలో ప్రాణాలతో మిగిలిన ఏకైక వ్యక్తి వివేక్ అగర్వాల్ తండ్రి రాధే శ్యామ్
అగర్వాల్. కుటుంబంలోని ఏడుగురు మరణించడంతో గురుగ్రామ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు, కోడలు, మనవరాలు, భార్య అందరూ ఒకేసారి మరణించారనే చేదు నిజాన్ని ఆయనకు ఎలా చెప్పాలో తెలియక బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, డీఎన్ఏ టెస్టుల అనంతరం బంధువులకు మృతదేహాలను అప్పగిస్తామని అధికారులు తెలిపారు.
కాగా, దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లోని ఓ రెస్టారెంట్లో భారీ స్థాయిలో మంటలు చెలరేగి 21 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఎంట్రీ, ఎగ్జిట్ ఒకటే మార్గం కావడంతో.. ఫ్లరిష్ బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్లో ఈ ప్రమాదంలో ఎక్కువ మరణాలు కనిపిస్తున్నాయి. మృతుల్లో విదేశీయులే ఎక్కువగా ఉన్నారు. ప్రమాదం నుంచి పలువురిని కాపాడినప్పటికీ మరికొందరు మంటల్లో చిక్కుకుని ఉంటారని తెలుస్తున్నది. స్థానికులు రోడ్డుపై పరుపులు పరచడంతో భవనంలోని మూడవ అంతస్తులో చిక్కుకున్న పలువురు వ్యక్తులు పైనుంచి కిందికి దూకారు. ఇందులో ఓ మహిళ తన చంటిబిడ్డను పట్టుకుని 3వ అంతస్తు నుంచి కిందకు దూకగా ఆమెకు కాలు విరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
DFSతోపాటు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది, పోలీసులు, అంబులెన్సు సర్వీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. హోటల్లో బస చేసిన విదేశీయులు సెంట్రల్ ఆసియా, ఆఫ్రికా నుంచి చికిత్స కోసం వచ్చినట్లు అధికారులు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
Follow for more Updates
