బంగారం కొనేవారికి అదిరిపోయే శుభవార్త..!

బంగారం కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. క్రితం రోజు కాస్త పెరిగినట్లు కనిపించినా మళ్లీ తగ్గడం మంచి అవకాశంగా చెప్పవచ్చు. మార్చి 10వ తేదీన ఉదయం 22 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.1800 మేర దిగిచ్చింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో బంగారం ధరలు పెరుగుతుంటాయి. సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటారు. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మొదలైనప్పుడు అదే జరిగింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. బంగారం ధరలపై యుద్ధంతో పాటు ఇతర అంశాలు ప్రభావం చూపిస్తున్నాయి.


దీంతో పసిడి రేట్లు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. గత శనివారం సెషన్‌లో పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగి ఆందోళన కలిగించినా ఆ మరుసటి రోజు నుంచి మళ్లీ తగ్గుముఖం పట్టడం భారీ ఊరటగా చెప్పవచ్చు. ప్రస్తుతం భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో బంగారం ధరలు దిగిరావడం కొనుగోలుదారులకు ఉపశమనం కల్పిస్తుందని చెప్పవచ్చు.

ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములపై రూ. 1800 మేర దిగివచ్చింది. దీంతో తులం బంగారం రేటు రూ. 1,48,200 వద్దకు దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 1960 మేర పడిపోయింది. దీంతో తులం ప్యూర్ గోల్డ్ రేటు రూ. 1,61,680 వద్దకు దిగివచ్చింది. బంగారం ధరలు అటూ ఇటూ మారుతున్నప్పటికీ వెండి రేటు మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. గత వారంలో కిలో వెండి ధర రూ. 30 వేలు మేర తగ్గిన సంగతి తెలిసింది. ఇప్పుడు అదే ధర వద్ద ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ. 2,90,000 పలుకుతోంది.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top