అస్సాంలోని జోర్హాట్ ఎయిర్‌బేస్‌లో విమాన ప్రమాదం జరిగింది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 ట్రాన్స్పోర్ట్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు. అయితే, విమానం ల్యాండ్ అయిన తర్వాత మంటలు చెలరేగడంతోనే కూలిపోయిందని సమాచారం.

మంటలు చెలరేగడానికి ముందే విమానం ల్యాండ్ అయింది, దీంతో ఎయిర్‌బేస్ ప్రాంగణంలో తక్షణమే అత్యవసర ప్రతిస్పందన చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి మృతుల సంఖ్య, నష్టం తీవ్రతపై స్పష్టత లేదు.. ఈ ప్రమాదంపై గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై భారత వైమానిక దళం ఒక ప్రకటన విడుదల చేస్తూ, “జోర్హాట్ లో IAFకు చెందిన AN-32 విమానం ప్రమాదానికి గురైందని చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కాసేపట్లో అందిస్తామని అధికారులు వెల్లడించారు.
అయితే ఒక పక్క మాత్రం అగ్నిప్రమాదం కారణంగానే విమానం కూలిందని సమాచారం.. అయితే, అగ్నిప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అధికారులు పరిశీలించనున్నారు. అధికారులు పరిస్థితిని అంచనా వేసి, సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
- అసోంలోని జోర్హాట్లో కూలిన IAF ఎయిర్‌క్రాఫ్ట్
- కూలిన AN-32 ట్రాన్స్పోర్ట్ విమానం.. పైలట్ మృతి
- ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సమీపంలోనే కూలిన ఎయిర్‌క్రాఫ్ట్
- జోర్హాట్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ చేస్తుండగా కూలిన విమానం
- ఘటనాస్థలంలో కొనసాగుతున్న సహాయకచర్యలు
Follow for more updates
